రోహిత్ మిస్టర్ వరల్డ్‌గా తొలి భారతీయుడు..
- July 20, 2016
మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు టైటిల్ సాధించాడు. ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్ వరల్డ్ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ 2016 మిస్టర్ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద రోహిత్ 50వేల డాలర్ల నగదు బహుమతిని అందుకున్నాడు. మిస్టర్ వరల్డ్ టైటిల్‌తో పాటు.. ప్రపంచ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్, మాబ్‌స్టార్ పీపుల్స్ ఛాయిస్ లాంటి సబ్టైటిళ్లకు కూడా రోహిత్ పోటీ పడ్డాడు.
26ఏళ్ల రోహిత్ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు. బాలీవుడ్ నటి కరీనాకపూర్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించిన రోహిత్.. తర్వాత పలు హిందీ సీరియల్స్‌లో నటించాడు. 2015లో మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







