136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- October 10, 2026
రియాద్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై సంకీర్ణ దళాలు భారీ స్థాయిలో సైనిక ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడుల్లో హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని 136 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాలు ప్రకటించాయి. యెమెన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించాయి. యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ ఈ వివరాలను వెల్లడించారు. హౌతీ యోధులు, వారి సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిరంతర వైమానిక మద్దతు
యెమెన్ ప్రభుత్వ దళాలు పలు యుద్ధ రంగాల్లో ముందుకు సాగేందుకు సంకీర్ణ దళాలు నిరంతర వైమానిక మద్దతు అందిస్తున్నాయని అల్ మాలికీ తెలిపారు. హౌతీల బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థను నిర్వీర్యం చేయడం, భవిష్యత్తులో దాడులు చేసే వారి సామర్థ్యాన్ని తగ్గించడం కూడా ఈ ఆపరేషన్ లక్ష్యాల్లో భాగమని పేర్కొన్నారు.
24 గంటల్లో 2,750కు పైగా దాడులు?
యెమెన్ ప్రభుత్వ దళాలు చేపట్టిన దాడుల వివరాలను ఆ దేశ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మాజిద్ అబ్దుల్లా అల్ నదీబ్ వెల్లడించారు. హౌతీ స్థావరాలపై 2,750కు పైగా దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 1,400 మందికి పైగా హౌతీలు మరణించారని, 250కు పైగా సైనిక వాహనాలు, పరికరాలు ధ్వంసమైనట్లు ఆయన వివరించాడు.
‘ఆపరేషన్ డాన్ ఆఫ్ యెమెన్’ ప్రారంభం
హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరించేందుకు యెమెన్ ప్రభుత్వ దళాలు ‘ఆపరేషన్ డాన్ ఆఫ్ యెమెన్’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించాయి. యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఛైర్మన్ రషాద్ అల్ అలీమి సోమవారం ఈ ఆపరేషన్‌ను ప్రకటించారు. యెమెన్ రాజధాని సనాను తిరిగి స్వాధీనం చేసుకోవడం సహా ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరించే దిశగా ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







