భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- September 17, 2025
భారత్-కెనడా దేశాలమధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న వేళ నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ హెచ్చరికలు పంపింది. గురువారం వాంకోవర్ లోని భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. భారత దౌత్యకార్యాలయ సందర్శనకు మరోతేదీని ఎంపిక చేసుకోవాలని ఇండో-కెనెడియన్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది.కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయర్ ఫొటోకు టార్గెట్ గుర్తు పెడుతూ ఒక కరపత్రం విడుదల చేసింది.
హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారని, ఇప్పటికీఖలిస్థానీలే లక్ష్యంగా భారత దౌత్య కార్యాలయం ఒక గూఢచార నెట్వర్క్ నడుపుతోందని ఎస్ఎఫ్ఎ ఆరోపించింది.ఖలిస్థాన్ పై ప్రజాభిప్రాయసేకరణ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ఇందరిత్సింగ్ గోసలు భారత ఏజెంట్లే హత్య చేసే,ప్రమాదం ఉందని ప్రకటనలో ఎస్ఎఫ్ఎ పేర్కొంది. కెనడా గడ్డపై భారత్ చేస్తున్న నిఘా, బెదిరింపుల నేపథ్యంలోకాన్సులేట్ను ముట్టడి చేస్తున్నట్లు వివరించింది.
ఖలీస్తానీ గ్రూపులకు ఎక్కడి నుంచి నిధులు?
అంతకుముందు ఈనెలలోనే ఖలిస్థానీ గ్రూపులపై కెనడా ప్రభుత్వంపై సంచలన నివేదికను వెల్లడించింది. 2025 అసెస్మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ ఇన్ కెనడా’ పేరట విడుదలైన నివేదికలో ఇక్కడి రెండు,ఖలిస్థానీ ఉగ్రసంస్థలకు తమ దేశం నుంచే నిధులు అందాయని తెలిపింది.
జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నకాలంలో,భారత్-కెనడాల మధ్య స్నేహసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన తన పదవినే వదులుకోవాల్సి వచ్చింది.ట్రూడో నిత్యం భారత్ పై ఏదో ఒక నిందను మోపుతూ వచ్చాడు.. ఎన్నికలు జరిగి కొత్త ప్రధాని ఎన్నికయ్యాక మళ్లీ,భారత్-కెనడా దేశాల మధ్య స్నేహసంబంధాలు మెరుగుపడుతున్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







