ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- September 20, 2025
మనామా: ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ భవన నిర్మాణాలను నియంత్రించే చట్టానికి (డిక్రీ-లా నం. 13 ఆఫ్ 1977) ముసాయిదా సవరణను ఆమోదించింది. ఇది నివాస ప్రాంతాలలో నిర్మాణం, కూల్చివేత మరియు తవ్వకం పనులను కొనసాగించడానికి వీలుగా వర్కింగ్ అవర్స్ ను మునిసిపాలిటీ నిర్ణయించడానికి అనుమతిస్తుంది.
షురా కౌన్సిల్ ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టం ఇప్పుడు అమల్లోకి రానుంది. వర్కింగ్ అవర్స్ షెడ్యూల్‌ను నిర్ణయించడానికి, స్థానిక పరిస్థితుల ఆధారంగా మినహాయింపులను మంజూరు చేయడానికి మునిసిపాలిటీకి అధికారాన్ని కల్పించారు.
రాబోయే చట్టం లైసెన్సింగ్ విధానాలు, ప్రాజెక్ట్ అవసరాలు మరియు నిర్మాణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను కవర్ చేస్తుంది. స్థానికులకు సౌండ్, అంతరాయం లాంటి ఇబ్బందులు కలిగించకుండా నిర్మాణ పనులైన తవ్వకం, బ్యాక్‌ఫిల్లింగ్ ను నిర్ధిష్ట సమయాల్లోనే కొనసాగించనున్నారు.
కొత్త చట్టం అమలుతో మునిసిపాలిటీలు నివాస ప్రాంతాలలో భవన నిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







