ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ

- September 20, 2025 , by Maagulf
ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ

హైదరాబాద్: చందానగర్‌లోని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు 150వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ హాజరయ్యారు.

స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సామాజిక సేవలో భాగంగా నిరంతరంగా 150 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగించడం విశేషమని పాల్గొన్న అతిథులు ప్రశంసించారు.

హోప్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com