మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్‌లు
- September 25, 2025
భారత వాయుసేనలో మరో కీలక మలుపు రానుంది. దశాబ్దాలుగా సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ, వాటి స్థానంలో దేశీయంగా రూపుదిద్దుకున్న తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిర్ణయం దేశ భద్రతా వ్యవస్థలోనే కాకుండా, భారత రక్షణ పరిశ్రమలో కూడా కొత్త దిశ చూపనుంది.రక్షణ శాఖ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) (HAL)తో రూ. 62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మొత్తం 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను భారత వాయుసేనలో చేర్చనున్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఒప్పందం ఖరారైనది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి బలమైన పునాది వేసిన మిగ్-21 విమానాలు, పదుల ఏళ్లుగా సేవలందించాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం మార్పులు, భవిష్యత్ సవాళ్లు దృష్టిలో పెట్టుకుని వాటిని విరమింపజేస్తున్నారు. వాటి స్థానాన్ని ఇప్పుడు ఆధునిక తేజస్ యుద్ధ విమానాలు దక్కించుకోనున్నాయి.రక్షణ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందంలో 97 విమానాల్లో 68 యుద్ధ జెట్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉంటాయి. వీటిలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థ, కంట్రోల్ యాక్యుయేటర్‌లు వంటి ఆధునిక సాంకేతికతలను అమర్చారు. ముఖ్యంగా 64 శాతం దేశీయ కంటెంట్, 67 స్థానిక ఉత్పత్తులు ఈ జెట్‌లలో వినియోగించబడ్డాయి. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి పెద్ద మద్దతు అందిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







