విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- October 01, 2025
మస్కట్: ఇండియాకు ప్రయాణించే విదేశీ పౌరులు ఇ-అరైవల్ కార్డును పూర్తి చేయాలని భారత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ విధానాలను వేగవంతం చేయడానికి , అంతర్జాతీయ విజిటర్స్ కు సులువైన ఎంట్రీ ప్రక్రియను నిర్ధారించడానికి డిజిటల్ ఎంట్రీ ఫారమ్ రూపొందించినట్లు తెలిపింది.
అంతర్జాతీయ విజిటర్స్ రాకపోకలకు ఆలస్యం కాకుండా ఉండటానికి బయలుదేరే 72 గంటల ముందు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలని కోరారు. పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు మరియు ఇతర అంతర్జాతీయ అతిథులతో సహా భారతీయేతర పౌరులకు వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మస్కట్ మరియు అనేక భారతీయ నగరాల మధ్య విమానాలను నడుపుతున్న ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ-అరైవల్ కార్డును ముందుగానే పూర్తి చేయడం వల్ల ఇబ్బంది లేని ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది. ఈ-అరైవల్ కార్డ్ ద్వారా అవసరమైన ప్రయాణ మరియు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్‌గా సేకరిస్తుందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రయాణానికి ముందు అదనపు సమాచారం కోసం ఎయిర్ లైన్ సిబ్బందని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







