బహరేన్ లో బాంబు దాడులు జరిపేందుకు ప్రణాళికలను రచించిన అయిదుగురి అరెస్ట్
- July 22, 2016
దేశంలో అనేక బాంబు దాడులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్న ఐదుగురు బహ్రేయినీ అనుమానితుల ప్రయత్నాలను సెక్యూరిటీ అధికారులు భగ్నం చేసారు. వారు బాంబులని తయారీ చేసి మరియు పేలుడు పదార్ధాలని నిల్వ చేయడంతో ఇటీవల వారిని అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. విద్యార్థుల సమూహంగా ఉన్న ఒక గుంపు ఇరాన్ మరియు ఇరాక్ లో సైనిక శిక్షణ పొందారు.హమద్ టౌన్ లో ఒక ఆటో-సేవ గారేజ్ నుండి ఆయుధాలు, పేలుడు, బాంబు సంపాదించే పదార్థాలని అనుమానితుల ద్వారా ఒక గిడ్డంగి వాడబడిందని పెద్ద సంఖ్యలో ఉన్న వాటిని పోలీసులు జప్తు చేసినట్లు ప్రకటించింది. వారి వద్ద నుంచి మరిన్నీ ఆయుధాలని వారి నివాసాల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోనికి తీసుకొన్న అనుమానితులు వరుసగా మహమ్మద్ అబ్దుల్జాళిల్ (28), మహమూద్ జస్సిమ్ (26), జస్సిమ్ మన్సూర్ (25) అహ్మద్ మహ్మద్ (23) మరియు ఖలిల్ హసన్ (20) గా ఉన్నట్లు గుర్తించారు.
అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రకటన ప్రకారం, ఈ ఆపరేషన్ తీవ్రవాద నిరోధక కార్యక్రమ ఫలితంగా వచ్చిందన్నారు. " తీవ్రవాద ఆరోపణలపై ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. బాంబు తయారు పదార్థాలు మరియు ఆయుధాలు స్వాధీనం చేసుకొని అనుమానితుల నుండి దాడుల సమాచారం రాబట్టగా వారు బహరేన్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాలలో పేలుళ్ల జరపాలని యోచన చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







