హాలీవుడ్ సినిమాలో నటించబోతున్న'అల్లు అర్జున్'
- July 17, 2015
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారట. ఇంకా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వని బన్నీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంపై ఫిల్మ్ నగర్ జనాలు ఆశ్యర్య వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేదో గాలి వార్త మాత్రం కాదంటున్నారు. హాలీవుడ్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఓ మళయాల ఫిల్మ్ మేకర్ ఇటీవల బన్నీని కలిసి హాలీవుడ్ ప్రాజెక్టు గురించి చెప్పాడని, ఆసక్తికరంగా ఉండటంతో బన్నీ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. బన్నీకి ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చే విధంగా ఈ ప్రాజెక్టు ఉండటంతో అల్లు అరవింద్ కూడా ఆసక్తి చూపినట్లు టాక్. తెలుగు, ఇంగ్లీష్ లో తెరకెక్కే ఈ ప్రాజెక్టు విషయాలన్నీ ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు. ఫైనల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే సినిమా విషయాలు బయట పెట్టనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాకి ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చాను తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19 నుండి ప్రారంభించనున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







