వంకాయ గోంగూర మసాలా
- July 17, 2015
వంకాయ గోంగూర మసాలా
కావలిసిన పదార్ధాలు
వంకాయలు - ఆరడజను
గోంగూర - ఒక కట్ట
ఉల్లిపాయులు - మూడు
పచ్చిమిర్చి - రెండు
దనియాల పొడి - ఒక స్పూను
దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
ఉడికించిన కొమ్ము శనగలు - ఒక కప్పు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
గరం మసాలా - ఒక స్పూను
నూనె - తగినంత
తయారీ విధానం
ముందుగా కొమ్ము శనగలను కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి దానిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక గోంగూరను వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చి,తరువాత వంకాయ ముక్కలను వేసి మగ్గనిచ్చి కొద్డిగా దనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టేయ్యాలి. కొంత సేపయ్యాక ఉడికించి పెట్టుకున్న శనగలను వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించి చివరిగా గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. చివరిగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేస్తే వంకాయ గోంగూర మసాలా కర్రీ రెఢీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







