సీనియర్ హీరోతో రాజమౌళి సూపర్ ప్లాన్..
- October 18, 2025
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్లోబ్-ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఆర్ఆర్ఆర్ (SSMB 29)లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం అది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయడం. దాంతో, ఆటోమేటిక్ గా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట.
అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, రాజమౌళి ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోను తీసుకున్నాడట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు రాజశేఖర్. అవును, రాజశేఖర్ చాలా కాలంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. విలన్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన ఎక్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయినప్పటికీ, మరో బంపర్ ఆఫర్ ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో ఒక విలన్ రోల్ కోసం రాజశేఖర్ ను అప్రోచ్ అవగా వెంటనే ఒకే చేశేశాడట ఆయన. ఈ పాత్రకు చాలా మంది హాలీవుడ్ నటులను అనుకున్నాడట రాజమౌళి. కానీ, ఫైనల్ గా ఆ అవకాశాన్ని రాజశేఖర్ కు ఇచ్చాడు. దీంతో, రాజశేఖర్ చాలా హ్యాపీ ఫలవుతున్నాడట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలుకాబోతుందట. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు “వారణాసి” అనే డివోషనల్ టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్ లో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







