నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- August 16, 2026
రియాద్: నీటి పొదుపు, సమర్థ వినియోగానికి సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆమోదించింది. పర్యావరణ, నీటి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఈ సవరించిన నిబంధనలు 2027 మార్చి 21 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. నీటి సామర్థ్య ప్రమాణాలను పాటించని శానిటరీ ఫిక్చర్స్ (నీటిని వినియోగించే బాత్రూమ్ పరికరాలు) ఉపయోగించడం నేరంగా పరిగణిస్తారు.
పట్టణ ప్రాంతాల్లో నీటి సామర్థ్యం లేని శానిటరీ పరికరాలను ఉపయోగిస్తే మొదటిసారి SR1,000 జరిమానా, రెండోసారి SR2,000 జరిమానా, మూడోసారి SR10,000 జరిమానా విధించనున్నారు. శానిటరీ పరికరాల్లో అమర్చిన నీటి పొదుపు భాగాన్ని తొలగించడం లేదా దానితో జోక్యం చేసుకోవడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీనికి మొదటిసారి SR500, రెండోసారి SR1,000, మూడోసారి SR2,000 జరిమానా విధిస్తారు.
భూగర్భ లేదా పైకప్పు నీటి ట్యాంకుల్లో పగుళ్లు, సరైన ఇన్సులేషన్ లేకపోవడం, ట్యాంక్లో లోపాలు లేదా ఫ్లోట్ వాల్వ్ లేకపోవడం వల్ల తాగునీరు వృథా అయితే మొదటిసారి SR5,000, రెండోసారి SR10,000, మూడోసారి SR50,000 జరిమానా విధిస్తారు.
ట్రీట్ చేసిన మురుగునీరు, శుద్ధి చేసిన నీటి నెట్వర్క్ లేదా లైసెన్స్ పొందిన బావి వంటి ప్రత్యామ్నాయ నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం కూడా ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ నిబంధన కింద మొదటిసారి SR25,000, రెండో లేదా మూడోసారి SR200,000 వరకు భారీ జరిమానా విధించనున్నారు.
ఈ నిబంధనలను అమలు చేయడం, ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకోవడం కోసం నేషనల్ వాటర్ ఎఫిషియెన్సీ మరియు కన్జర్వేషన్ సెంటర్ ( National Water Efficiency and Conservation Center)కు అధికారాలు కల్పించారు. పట్టణ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నీటి సామర్థ్యం, పొదుపు ప్రమాణాలను పర్యవేక్షించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







