మెడ చుట్టూ నలుపు తొలగించుకోండిలా
- July 17, 2015
కాలుష్యం, మురికి, వయసు మీద పడడంలాంటి కారణాల వల్ల మెడ భాగం నల్లగా మారి ముడతలు కూడా పడుతుంది. ఇది పోవాలంటే విటమిన్ సి ఉన్న పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకాయ చెక్కకు ఉప్పుగానీ పంచదార గానీ రాసి దాంతో సున్నితంగా మెడను మర్దన చేసుకోవడం వల్ల క్రమంగా మెడ నలుపు పోతుంది. కీర దోస గుజ్జును మెడ భాగంలో రాసి పదిహేను నిముషాలు రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. పాల మీగడకు చర్యాన్ని తెల్లగా మార్చే లక్షణం ఉంటుంది. కాబట్టి మీగడలో కొద్దిగా పసుపు కలిపి మెడకు పట్టించి కొద్దిసేపయ్యాక స్నానం చేయాలి. కలబంద గుజ్జుతో మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీది సున్నితమైన చర్మం అయితే గులాబీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో సున్నితంగా తుడవడం వల్ల కూడా మెడ నలుపు పోతుంది.కమలా ఫలాల తొక్కల పొడిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా చేసి మెడకి పట్టించి, ఆరాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







