కారు బాంబు పేలి 80 మంది మృతి
- July 17, 2015
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 80 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారని భద్రత దళాలు శనివారం వెల్లడించాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని... దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రత దళాలు పేర్కొన్నాయి. ఈ బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. బాంబు పేలుడుతో ఖాన్ బని సాద్ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిందని చెప్పారు. రంజాన్ పండగ సమీపించడంతో మార్కెట్ ప్రాంతమంతా జనాలతో నిండి ఉందని తెలిపారు. మార్కెట్ లోని ట్రక్ లో బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







