కబాలి అభిమాని ఆత్మహత్య
- July 23, 2016
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పటికే జపాన్ మలేషియా దేశాల్లో రజనీకి అక్కడ స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలేషియాలో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేసే సంఘటన ఒకటి కబాలి సినిమా రిలీజ్ రోజు జరిగింది. రజనీ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మలేషియాలో అక్కడి ప్రాంతీయ చిత్రం స్థాయిలో మలాయ్ భాష లో రిలీజ్ అయ్యింది.సినిమా టికెట్ల కోసం మలేషియన్ అభిమానులు కూడా భారీగా పోటి పడ్డారు. ఈనేపథ్యంలో టికెట్ దొరకని ఓ అభిమాని పది అంతస్థుల బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియాలోని కేన్ సిసి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కబాలి సినిమాలో అత్యధిక శాతం షూటింగ్ మలేషియాలోనే జరగటంతో సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఏర్పాడ్డాయి
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









