'22జూలై1947' కన్నడ చిత్ర ట్రయిలర్‌ను మోడీ విడుదల చేశారు!
- July 23, 2016
దేశ ప్రధాని నరేంద్రమోడీ మొట్టమొదటి సారిగా ఓ కన్నడ చిత్ర ట్రయిలర్‌ను విడుదల చేయడం శాండల్‌ఉడ్‌లో సంచలనంగా మారింది. దేశంపై ప్రేమ, గౌరవాలకు సంబంధించిన సందేశాత్మక చిత్రమైన '22జూలై1947' కన్నడ చిత్ర ట్రయిలర్‌ను మోడీ ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. చిత్ర దర్శకుడు విశాల్‌రాజ్, చిత్ర నిర్మాత సంజేగౌడలు మాట్లాడుతూ చిత్రంలోని సందేశాత్మకతకు మెచ్చి చిత్ర ట్రయాలర్‌ను విడుదల చేయడం కన్నడ సినీ రంగానికి ఎంతో గర్వకారణమన్నారు.ట్రయిలర్‌ను మోదీ చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఎంపీ సురేశ్‌కు, కేంద్ర ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి అరుణజైట్లీ కృషి చేశారని తెలిపారు. సుచేంద్ర ప్రసాద్, అచ్యుత్‌కుమార్, సీనియర్ నటి సుధారాణి, నంజేగౌడ తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుట ముందుకు రానుందని, కన్నడతో పాటు తెలుగు, తమిళ తదితర భాషలల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







