ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- November 09, 2025
అమరావతి: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ0 మరియు జాతీయ విద్యా దినోత్సవంను ఈనెల 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నది.ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు, కార్యాచరణ అమలుకు సంబంధించిన అంశాల పై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.ఆదివారం తాడేపల్లి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకుబ్ భాష, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ.శేఖర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, వక్ఫ్ బోర్డు సిఈవో మహమ్మద్ అలీ, మైనారిటీ కమిషన్ కార్యదర్శి నిజాముద్దీన్ తదితరులతో మైనారిటీ, జాతీయ విద్యా దినోత్సవం విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఫరూక్ చర్చించారు. ఈ సందర్భంగా మైనారిటీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాలలో కూడా భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషితో దేశంలో అత్యున్నతమైన విద్యా వ్యవస్థ ఉన్నతికి పునాదులు పడ్డాయని అన్నారు.మహనీయుడు ఆజాద్ జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఉర్దూ భాషాభివృద్ధికి విశిష్ట కృషి చేసిన వారికి అవార్డులు, జీవిత సాఫల్య అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులను అందజేయనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రoలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







