బరువు పెరగడానికి బ్రేక్ వేసే వంకాయ...
- July 24, 2016
బరువు తగ్గాలా..? ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీలను కలిగి వుండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్, మినరల్ స్థాయిలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకొని, పోషకాహర లోపానికి గురవకుండా జాగ్రత్తపడాలని వారు సూచిస్తున్నారు. నీరు లేదా ఇతర ద్రావణాలు బదులుగా పోషక విలువలు కలిగినట్టి పండ్ల రసం, పాలను ఎంచుకోవాలి.
తక్కువ పోషకాలు కలిగిన లేదా ఎక్కువ ఫాట్లున్న ద్రావణాలకు బదులుగా ఇంట్లో ఉండే తాజా పండ్లు తీసుకోవడం మంచిది. నట్స్, సీడ్స్, ఎండిన పండ్లు, తాజా పండ్ల వలన పోషకాలను పొందటమే కాకుండా సులభంగా బరువు తగ్గొచ్చు.
ఇంకా వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. కాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు.
వంకాయలోని పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







