'మజ్ను' గా మారిన నాని
- July 24, 2016
నాని కథానాయకుడిగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. పి.కిరణ్ నిర్మాత. తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేశారు. 29 ఏళ్ల క్రితం నాగార్జున కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది. 'ప్రేమమ్' చిత్రానికి 'మజ్ను' అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే 'మజ్ను'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







