జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం
- July 24, 2016
జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్ లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







