తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్

- November 20, 2025 , by Maagulf
తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా వాసిగా, మన రాష్ట్రానికి నూతన దిశానిర్దేశం చేస్తున్న మన ముఖ్యమంత్రి A.రేవంత్ రెడ్డిని చూడటం నాకు అపార గర్వం. ప్రజల సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న అంకితభావం,దూరదృష్టి, సత్వర స్పందన మరియు పేదల పట్ల చూపుతున్న సానుభూతి నిజంగా ప్రశంసనీయం.ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు లక్షలాది మందికి ఆశాజ్యోతి వంటివి.

విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, నేను అత్యంత ప్రేమతో, నిబద్ధతతో కొనసాగిస్తున్న నా చిత్రకళా ప్రయాణం నాకు అమూల్యమైన ఆనందాన్నిస్తుంది. అక్రిలిక్, ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా భావోద్వేగాలను,సాంస్కృతిక విలువలను, సృజనాత్మకతను ప్రతిబింబించే ఎన్నో చిత్రాలను సృష్టించాను.హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ వంటి ప్రతిష్ఠాత్మక కళా వేదికలలో నా చిత్రాలు ప్రదర్శించబడటం నాకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

అలాగే, మన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల చిత్రాలను అత్యంత శ్రద్ధతో, కళాత్మక నైపుణ్యంతో, నిమగ్నతతో దాదాపు ఒక నెలపాటు శ్రమించి రూపొందించి వారికి అందించడం నాకు విశేష ఆనందాన్నిచ్చింది.వారు వ్యక్తిగతంగా తెలియజేసిన హృదయపూర్వక అభినందనలు నా కళాజీవితానికి ఒక అమూల్య ప్రేరణగా నిలిచాయి.

ప్రస్తుతం నేను భారతీయ కళలు, సంస్కృతి, చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాలు మరియు పండుగల వైభవాన్ని ఆకళింపు చేసే విధంగా దాదాపు 50 అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందిస్తున్నాను.ఈ సృజనాత్మక కృషిని కూడా ముఖ్యమంత్రి మెచ్చుకోవడం నాకు మరింత ఉత్తేజాన్ని, మరింత నిబద్ధతను అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com