సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- March 17, 2026
ఐయోవా: మార్చ్ 16 అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఐయోవాలో హియావత పబ్లిక్ లైబ్రరీలో అడ్వెంచర్స్ అన్వేల్డ్ పేరుతో ఓ అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకునే సాహస యాత్రికులకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఐయోవా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాట్స్ ఐయోవా విభాగం చేపట్టిన ఈ సదస్సులో స్థానిక సాహస దంపతులు పాడి, అనిత తాము విజయవంతంగా పూర్తి చేసిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, మౌంట్ కిలిమంజారో యాత్రలకు సంబంధించిన అనుభవాలను ఈ వేదిక పై పంచుకున్నారు.
పర్వతారోహణకు అవసరమైన సన్నద్ధత, ఎదురయ్యే సవాళ్లు మరియు ఆచరణాత్మక చిట్కాలను పాడి-అనిత దంపతులు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమాజానికి నాట్స్ అందిస్తున్న సేవలను నాట్స్ సలహా మండలి సభ్యులు జ్యోతి ఆకురాతి వివరించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఆదుకునే ‘నాట్స్ హెల్ప్‌లైన్’ ఎలా పనిచేస్తుందనేది తెలిపారు., ప్రతి ఒక్కరూ నాట్స్ సభ్యులైతే.. నాట్స్ హెల్ప్ లైన్ వారికి కొండంత అండగా ఉన్నట్టే అనే భరోసా ఇచ్చారు.
పర్వతారోహణపై విలువైన అవగాహన కల్పించిన వక్తలకు డాక్టర్ స్మిత కుర్రా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక స్పాన్సర్లను అభినందించారు.ఈ అవగాహన సదస్సు వెనుక నాట్స్ ఐయోవా చాప్టర్ టీం జాయింట్ కో ఆర్డినేటర్ నవీన్ ఇంటూరి, నాట్స్ ఐయోవా నాట్స్ నాయకులు గిరీష్ కంచర్ల లాజిస్టిక్స్, భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐయోవా నాట్స్ సభ్యులు సింధు మన్వాడి వేదిక అలంకరణ సెటప్‌ను బాధ్యతలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ అధినేత కృష్ణ మంగళమూరి, డల్లాస్ డేటా సైన్స్ అధినేత వంశీ నెల్లుట్ల...వేదికను అందించిన హియావత పబ్లిక్ లైబ్రరీ యాజమాన్యానికి నాట్స్ ఐయోవా విభాగం కృతజ్ఞతలు తెలిపింది.ఈ అవగాహన సదస్సు అందించిన సమాచారం, స్ఫూర్తితో చాలా మంది తెలుగు వారు తమ సాహస యాత్రలను ప్రణాళిక చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.తెలుగు వారి కోసం ఇంత చక్కటి అవగాహన సదస్సు నిర్వహించిన ఐయోవా నాట్స్ విభాగాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







