శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- November 24, 2025
శ్రీశైలం: శ్రీశైలంలోని వసతి సౌకర్యాలను ఆన్లైన్లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.
తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్సైట్ కాకుండా ఏ ఇతర లింక్లు, పేజీలు ద్వారా బుకింగ్లు చేయవద్దని భక్తులకు సూచించారు.
తాజా వార్తలు
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్
- శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!







