డైరెక్టర్ మహేశ్ బాబు.పి తో మాగల్ఫ్ ముఖాముఖీ

- November 25, 2025 , by Maagulf
డైరెక్టర్ మహేశ్ బాబు.పి తో మాగల్ఫ్ ముఖాముఖీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు.పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు.హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్  పెట్టడానికి కారణం?

-ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  

-ఈ సినిమా 2002 టైం లో జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది. కన్నడలో కూడా ఈ సినిమాని అదే టైటిల్తో రిలీజ్ చేస్తున్నాం.

-ఈ సినిమాకి ముందు 'ఆంధ్ర కింగ్' పేరు పెట్టుకున్నాను. ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో ఎవరి తాలూకా అని డైలాగ్ వస్తుంది. అప్పుడు హీరో తన ఐడెంటిటీ గా ఫీల్ అవుతున్న ఎమోషన్ ని ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం జరిగింది.

ఆంధ్ర కింగ్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని తీసుకోవడానికి కారణం?
-రానా,ఉపేంద్రతో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర గారు 'నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి' అని చెప్పారు.ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడే సూర్య అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనిపించింది.సూర్య పాత్ర కోసం మేము ఆయన్నే  సంప్రదించాము.ఉపేంద్రకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు.ఉపేంద్ర గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన గురించి మరింత తెలుసుకున్నాను.

ఇది ఫ్యాన్ బయోపిక్ అన్నారు కదా మీకు అలా ఇన్స్పైర్ చేసిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా?
-ఒక్క పర్సన్,  ఇన్సిడెంట్ అని చెప్పలేను. చాలా రోజుల క్రితం ఒక సినిమాకి వెళ్లాను. ఆ సినిమా నాకు అంతగా నచ్చలేదు. కానీ నా పక్కన ఉన్న ప్రేక్షకుడు ఆ డైలాగులకు చాలా ఇన్స్పైర్ అవుతున్నాడు.ప్రతి డైలాగ్ కి కనెక్ట్ అవుతున్నాడు, నిజానికి అక్కడ ఉన్న హీరోతో తనకి పర్సనల్గా ఎటువంటి కనెక్షన్ ఉండదు.కానీ తను చెప్పే ప్రతి మాటకి ఇన్స్పైర్ అవడం అనేది నాకు చాలా కనెక్టింగ్ గా అనిపించింది. అలాంటి కథని ఎవరూ చెప్పలేదనిపించింది.

-సౌత్ ఇండియాలో హీరోస్ ని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్ కనిపించాయి.అలా ఆ ఇద్దరి రిలేషన్ లో ఒక కథ  చెప్పొచ్చు అనిపించింది.  ఫ్యాన్ ని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ కంప్లీట్ డిఫరెంట్, చాలా యూనిక్.

ఈ కథ రామ్ కి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి?
-మైత్రి మూవీ మేకర్స్ కి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. రామ్ గారు అప్పటికే చాలా పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. నేను ఒక సినిమా మాత్రమే చేసిన దర్శకుడిని. ఆయన కాల్ చేసి 20 నిమిషాల్లో కథ చెప్పగలవా అని అన్నారు. నేను అప్పటికే పూర్తి కథని రాసుకున్నాను. ఆయనకి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని రాత్రంతా ఆలోచించాను. ఆయనకి కలిసి కథ చెప్పాను. పూర్తి కథ విన్నారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. 'ఆయన ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేసిన కథ ఇదే' అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది

ఈ సినిమాలో ఫ్యాన్ బాయ్ గా రామ్ ని ఎంచుకోవడానికి కారణం?
-రామ్ చాలా వెర్సటైల్ యాక్టర్.ఆయన క్యారెక్టర్ లో పెర్ఫార్మెన్స్ లో చాలా ఎనర్జీ ఉంటుంది . నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి.ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్ గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్ కావాలి. ఇలాంటి క్యారెక్టర్ కి రామ్ గారు పర్ఫెక్ట్.

-ఈ సినిమాకి నేను రామ్ అద్భుతమైన వేవ్ లెంత్ లో వర్క్ చేసాం.ఇద్దరం ఒకటే అన్నట్టుగా పని చేసాం.ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాలు వేరు..ఈ సినిమా వేరు.ఈ మాట హానెస్ట్ గా చెప్తున్నాను.ఆయన కంఫర్ట్ లెవల్ ని దాటి ఈ సినిమాని చేశారు. ఆయన ఈ క్యారెక్టర్ ఇంత అద్భుతంగా చేయడానికి ఆయన ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్.

భాగ్యశ్రీ పాత్ర ఎలా ఉంటుంది?
-భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం.ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మ ,రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ ఇలా ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ ఒక ఎమోషన్ తో ఉంటుంది.

మీరు పర్సనల్ గా ఎవరికి ఫ్యాన్?
-నాకు చిన్నప్పుడు పరిచయమైంది పవన్ కళ్యాణ్, ఆయనంటే చాలా అభిమానం. అలా అని ఈ టైటిల్ పెట్టలేదు(నవ్వుతూ) తర్వాత సినిమాలో పనిచేస్తున్నప్పుడు మా గురువుగారు కృష్ణవంశీ గారికి ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆరాధించేవాడిని. ఆయన నాకు ఒక గొప్ప మాట చెప్పారు. 'నీకు నేనంటే కాదు సినిమా అంటే ఇష్టం. సినిమా పట్ల ఇష్టంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను దానికి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాను. ఇకపై నువ్వు సినిమా నే ప్రేమించాలి'. ఆ మాట నన్ను చాలా కదిలించింది.

ఉపేంద్ర ఈ సినిమా చూసి కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారని చెప్పారు కదా?
-ఆయనకి అలా అనిపించింది.మన జీవితంలో ఎవరికి ఒకరికి ఫ్యాన్ అయి ఉంటాము. మనం అభిమానించే వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామనే  ఒక అంతర్గతమైన విషయం ఉంటుంది. ఇందులో అది చాలా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.

మ్యూజిక్ గురించి?
-వివేక్ మెర్విన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. వాళ్ల ద్వారా ప్రేక్షకుల నుంచి మరింత అటెన్షన్ వచ్చింది.చిన్ని గుండెలో నా ఫేవరెట్ సాంగ్.నువ్వుంటే చాలు పాట కూడా నాకు చాలా ఇష్టం. ఇందులో చంద్రబోస్ రాసిన ఇంకో రెండు పాటలు ఉన్నాయి.అలాగే ఒక మంచి థీమ్ సాంగ్ ఉంది.అది కూడా నాకు ఫేవరెట్. సినిమాలో మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.  

 ఇది ఫ్యాన్స్ గురించి తీసిన సినిమా కదా మరి షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ ఫాన్స్ వచ్చి కలిశారా?
-అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్  విపరీతంగా వచ్చేవారు. అంత మంది జనం చూసినప్పుడు అక్కడ ఏదైనా షూటింగ్ జరుగుతుందనుకునేవాడిని. కానీ రామ్ గారు రాత్రి ఒంటిగంట వరకు ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చేవారు.రామ్ కి అభిమానులు అంటే చాలా ప్రేమ.వాళ్ల గురించి ఎప్పుడూ చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ సినిమా ఆయన చేయడానికి కారణం ఆయన అభిమానులే.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?
-మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ కథకు కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు.చాలా ఫ్యాషన్ అన్న నిర్మాతలు.

రామ్ ఈ సినిమాలో పాటలు రాయడం ఎలా అనిపించింది?
-నిజంగా రామ్ కి పాటలు రాసే టాలెంట్ ఉందని నాకు తెలియదు.ఆయనకి మ్యూజిక్ పట్ల విపరీతమైన నాలెడ్జ్.మ్యూజిక్ సిట్టింగ్ కి కంపల్సరిగా వస్తారు. ఒక ట్యూన్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఎమోషన్ ని ఆయనే మాటలు రూపంలో చెప్పారు. అది నాకు చాలా నచ్చింది.తర్వాత పల్లవి కూడా రాశారు.అది మాకు అన్ని విధాలుగా ప్లస్ అయింది.

కొత్తగా చేయబోతున్న సినిమాలు గురించి?
-కొన్ని కథలు ఉన్నాయి. చర్చిస్తున్నాము.ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటి మీద వర్క్ చేస్తాను

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com