100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన 'పెద్ది' చికిరి చికిరి సాంగ్
- November 25, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్-ఇండియా మూవీ పెద్ది నుండి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మార్చింది.విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది.
అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఖండాలలో ప్రతిధ్వనించింది. భాషా సరిహద్దులను అప్రయత్నంగా దాటింది.వైరల్ బీట్లు, జానపద-మూలాలున్న పల్స్,సినిమాటిక్ సౌండ్‌స్కేప్ ప్రపంచంలోని ప్రతి మూల నుండి శ్రోతలను అలరించాయి. అన్ని భాషల్లో సాంగ్ 100+ మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసింది.
తెలుగు వెర్షన్ సాంగ్ ముందంజలో ఉంది.దాదాపు 64 మిలియన్ వ్యూస్, 1 మిలియన్‌కు చేరువైన లైకులతో దూసుకెళ్తూ, రామ్‌చరణ్ అసమానమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. హిందీ వెర్షన్ కూడా 25 మిలియన్ వ్యూస్‌తో బలంగా నిలవగా, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్లు కలిపి మరో 10 మిలియన్ వ్యూస్‌ను యాడ్ చేశాయి. దీంతో ఈ పాట పాన్-ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సంచలనానికి అసలు హైప్ తెచ్చింది రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డాన్స్ స్కిల్స్, మ్యాగ్నెటిక్ ఆరా. ఈ పాటలో రా, రస్టిక్‌గా పవర్ ఫుల్ గ్రేస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన స్టెప్స్‌ను వేలాది మంది అభిమానులు రీక్రియేట్ చేస్తుండగా, సోషల్ మీడియాలో చికిరి ఫెస్టివల్ కొనసాగుతోంది.హై ఎనర్జీ డాన్స్ రీల్స్ నుంచి స్టైలిష్ ఎడిట్స్, ఫ్యాన్ ట్రిబ్యూట్స్ వరకూ టైమ్లైన్లు నిండిపోతున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న పెద్ది విడుదలకు ముందే భారీ హైప్ సృష్టించింది.తొలి సింగిల్‌నే గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా మారడంతో, సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి.రాబోయే ఏడాది పెద్ది బిగ్గెస్ట్ గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







