ఆంధ్రప్రదేశ్‌లో వాహనాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్...
- July 25, 2016
ఆంధ్రప్రదేశ్‌లో వాహనాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం విజయవాడలో ప్రారంభించారు. ఇకపై వినియోగాదారులు వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లోనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉమా మాట్లాడుతూ.. ఆన్లైన్ విధానం వల్ల అవినీతి తగ్గుతుందన్నారు. వాహనదారులకు శాశ్వత నంబరు కేటాయింపు 75 రోజుల నుంచి ఒక్కరోజుకు తగ్గుతుందన్నారు. వాహనదారులకు నాలుగు రోజుల్లో హై సెక్యూరిటీ కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







