ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- December 03, 2025
అమరావతి: ఏపీ ప్రభుత్వం(AP) మహిళలకు అందించే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే అమలు అయిన ఈ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం పథకం అమలును నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైతే మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఏపీఎస్ఆర్టీసీకి(AP) త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సమీక్షలో వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రానున్నాయి. వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయణ సౌకర్యం కల్పించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న కేటగిరీలే కాకుండా మహిళలకు ఈ బస్సుల్లోనూ అవకాశం దక్కుతుంది. అయితే.. పల్లెలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలకు ప్రయోజన కరంగా మారనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







