వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- February 07, 2026
ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ (20) కొంత పోరాడినా, తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కగా నిలబెట్టాడు. 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అమెరికా బౌలర్లలో షెడ్లీ వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుదిపేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







