మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సభార్ధి నేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరిని NHAI చైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రహదారి అభివృద్ధి అంశాలపై వివరంగా చర్చించారు.
ఈ భేటీ పార్లమెంట్ హాల్లోని CoSL చైర్మన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా బాలశౌరి తమ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా:
- మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే పనులు
- గుడివాడ–కంకిపాడు గ్రీన్‌ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
- పెడన–లక్ష్మీపురం రహదారి పనులు
- అలాగే ఇతర అభివృద్ధి పనులు
ఈ వివరాల పై సంతోష్‌కుమార్ యాదవ్ సానుకూల స్పందన చూపిస్తూ, వెంటనే సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలనే దిశగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







