స్ట్రీమింగ్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- December 05, 2025
అంతర్జాతీయ వినోద రంగం దృష్టిని ఆకర్షించే విధంగా, నెట్‌ఫ్లిక్స్ ఒక భారీ వ్యాపార ఒప్పందాన్ని ప్రకటించింది.Warner Bros టెలివిజన్ స్టూడియోస్, HBO, HBO Max వంటి ప్రముఖ బ్రాండ్లను $82.7 బిలియన్ (సుమారు ₹7.44 లక్షల కోట్లు)కి కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఒక్కో షేర్ విలువను $27.75గా లెక్కగట్టి ఈ కొనుగోలు నిర్మాణాన్ని రూపొందించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
ఈ డీల్ పూర్తయ్యే ప్రక్రియ సుమారు రెండు సంవత్సరాలు సాగనుందని, అధికారికంగా 2026 మూడో త్రైమాసికంలో పూర్తి అవుతుందని అంచనా. ఈ ఒప్పందం వినోద రంగపు శక్తి సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
లక్షల గంటల Warner Bros కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో
ఈ కొనుగోలుతో Warner Brosకు చెందిన అనేక దశాబ్దాల కంటెంట్—సినిమాలు, టెలివిజన్ షోలు, HBO ఒరిజినల్స్, ప్రీమియం సిరీస్‌లు—అన్నీ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్లకు ఇది భారీ విజువల్ లైబ్రరీ విస్తరణగా మారనుంది. నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరండోస్ మాట్లాడుతూ, “ప్రపంచాన్ని ఎంటర్‌టైన్ చేయడం మా ప్రధాన లక్ష్యం. ఈ డీల్ ఆ లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం పూర్తయ్యాక, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్రపంచంలో అత్యంత పెద్ద కంటెంట్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. పోటీదారులైన డిస్నీ, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలకు ఇది గట్టి సవాలుగా మారనుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







