'సిగ్మా' లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్
- December 05, 2025
విజనరీ సుబాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, వరల్డ్ వైడ్ ఎట్రాక్షన్ వుండే బిగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే చిత్రాలని చేస్తోంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీ సిగ్మాను నిర్మాణ సంస్థ ప్రస్తుతం చిత్రీకరిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. బిగ్ స్కేల్, యూత్ వైబ్‌తో, సిగ్మా మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ గా మారుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా, సందీప్ కిషన్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లు, నేపథ్య స్కోర్‌లకు పేరుగాంచిన ఎస్ థమన్ పవర్ ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది. భారీ, కలర్ ఫుల్ సెట్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్‌ను ఉర్రూతలూగిస్తుంది.
సిగ్మా లో సందీప్ కిషన్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ పెర్సోనా లో కనిపించనున్నారు ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తనదైన దారిలో నడిచే ‘సిగ్మా’ అనే మావెరిక్ హీరో చుట్టూ కథ తిరుగుతుంది. అతని పట్టుదల, సహనం, ఎవరూ ఊహించని పద్ధతుల్లో ఎదగడం థ్రిల్‌ని ఇస్తుంది. యంగ్ డైనమిక్ దర్శకుడు జేసన్ సంజయ్ సెన్సిబిలిటీలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్, ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్., ఆర్ట్ డైరెక్టర్ బెంజమిన్ ఎం.తమిళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్, చెన్నై, తలకోన అడవులు, థాయిలాండ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది.పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







