డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!

- December 05, 2025 , by Maagulf
డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!

దోహా: ఖతార్ ప్రతిష్టాత్మకమైన డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. కింబర్లీ లాబొరేటరీ ఫర్ డైమండ్ అండ్ జెమ్‌స్టోన్ టెస్టింగ్‌లో ప్రపంచంలోని ప్రముఖ అధికార సంస్థ అయిన జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA) సహకారంతో ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లండించింది. మంత్రిత్వశాఖ అనుమతి ఉన్న జెమ్‌స్టోన్స్ విజువల్ ఆర్ట్స్ సెంటర్ అందించే ఈ ప్రొఫెషనల్ వృత్తి విద్య కోర్సును పూర్తి చేయడం ద్వారా డైమండ్ టెస్టింగ్ లో నిపుణులుగా స్థిరపడవచ్చని తెలిపింది.

ఖతార్,  GCCలో ఈ తరహా కోర్సు ప్రారంభించడం ఇదే మొదటి సారని విద్యా సేవల కేంద్రాల విభాగం డైరెక్టర్ ఎమాన్ అల్-నుయిమి తెలిపారు.  ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు కేంద్రంగా ఖతార్ ను నిలుపుతుందని, అధిక నైపుణ్యం అవసరమయ్యే రంగాలలో ప్రత్యేక శిక్షణ కోరుకునే వారికి ఖతార్‌ గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రసిద్ధ అమెరికన్, బెల్జియన్ మరియు స్విస్ సంస్థలతో సహకార ప్రోగ్రామ్‌పై విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఇది ఇప్పటికే పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించిందని అల్-నుయిమి తెలిపారు.    

ఖతార్ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇచ్చేలా, యువతలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహించే అధిక-నాణ్యత గల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ ముందు వరుసలో ఉంటుందని అల్-నుయిమి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com