ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

- December 06, 2025 , by Maagulf
ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

భారతదేశం అభివృద్ధి చేసిన UPI చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని విస్తరిస్తోంది. ‘స్కాన్ – పే – డన్’ అనే సులభమైన పద్ధతితో దేశంలోనే కాక, విదేశాల్లోనూ డిజిటల్ పేమెంట్స్‌కు ఇది నూతన ప్రమాణంగా మారుతోంది. సంవత్సరాల క్రితం ఊహించని స్థాయిలో ఇప్పుడు UPI ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఫైనాన్షియల్ సెక్సెక్రటరీ నాగరాజు వెల్లడించిన వివరాలు ఈ విస్తరణకు మరింత బలం చేకూర్చాయి.

UPI ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఖతర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్‍ వంటి దేశాల్లో పూర్తి స్థాయిలో అమల్లో ఉంది. వివిధ బ్యాంకింగ్ నెట్‌వర్క్స్‌తో అనుసంధానం చేయడం, QR ఆధారిత చెల్లింపులను అనుమతించడం వంటి అంశాలు ఈ దేశాల్లో పేమెంట్ వ్యవస్థలను మరింత సులభతరం చేశాయి. ప్రస్తుతం ఈస్ట్ ఏషియా సహా మరో 8 దేశాలు UPI అనుసంధానంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో UPIని అందుబాటులోకి తీసుకురావడమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. సాధారణ వినియోగదారుల నుంచి వ్యాపారాలు, టూరిజం రంగం వరకు—UPI విస్తరణ ద్వారా క్రాస్ బోర్డర్ పేమెంట్స్ మరింత సౌకర్యవంతం కానున్నాయి. UPI ద్వారా చేసే రియల్-టైమ్ లావాదేవీలు ఇతర దేశాలకు కూడా ఆకర్షణీయ అంశంగా మారాయి.

UPI వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు దాటింది. అందులో 49 కోట్లు భారతదేశానికే చెందటం దాని ఇంటి వద్ద ఉన్న అపారమైన వినియోగదార్ల బలం స్పష్టంగా చూపిస్తోంది. ఈ భారీ యూజర్ బేస్‌ వల్లే అంతర్జాతీయ స్థాయిలో UPIపై విశ్వాసం పెరిగింది. బ్యాంకులు, ఫిన్‌టెక్‌లు, ప్రభుత్వాలు—UPI అనేది నిరూపితమైన, భారీ స్థాయిలో పనిచేసే డిజిటల్ పేమెంట్ మోడల్‌గా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యంత తక్కువ ఖర్చుతో, వేగవంతమైన, మోసం లేని లావాదేవీలను అందించే ఈ వ్యవస్థ భవిష్యత్తు గ్లోబల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌ను మలిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com