వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’

- December 07, 2025 , by Maagulf
వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’

ఖతార్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా నివసిస్తూ సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న విశాఖ వాసి, కమ్యూనిటీ నాయకుడు మరియు హ్యూమానిటేరియన్ వెంకప్ప భాగవతులకి గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) అత్యున్నత గౌరవంగా “ఉత్తమ సేవా పురస్కారం (Best Philanthropy Award)” ప్రకటించబడింది.

ఇటీవలి ఇండోర్, మధ్యప్రదేశ్‌లో జరిగిన GIO నాల్గవ అంతర్జాతీయ మహాసభలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేశారు. స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సామాజిక సేవా రంగంలో చూపుతున్న ఆయన అంకితభావం, మానవతా విలువలు మరియు ప్రభావవంతమైన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.

పురస్కారం స్వీకరించిన అనంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన వెంకప్ప భాగవతుల , “ఈ అవార్డు నా వ్యక్తిగత కృషికి మాత్రమే కాకుండా, ఈ ప్రయాణంలో నా వెంట నడిచిన సహచరులు, భాగస్వాములు, మార్గదర్శకులు, మిత్రులు మరియు సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి గుర్తింపు” అని పేర్కొన్నారు.

అలాగే, GIO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గౌరవం తనను మరింతగా నేర్చుకునేందుకు, ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరేపిస్తుందని తెలిపారు. “స్థానికంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయడంలో కొనసాగుతాను” అని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక సేవ పట్ల తన నిరంతర కృషితో ఇప్పటికే అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వెంకప్ప భాగవతుల తాజా సత్కారం, సమాజ సేవలో నూతన మైలురాయిగా నిలిచింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మా గల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com