ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు

- December 08, 2025 , by Maagulf
ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు

న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు కొనసాగేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇకపై నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ సిస్టమ్ USSD ఆధారంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో, పేదవర్గాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత సులభతరం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. మీరు ఉపయోగిస్తున్న మొబైల్‌లో బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటే చాలు, ఈ సేవను పొందవచ్చు.

ఆఫ్‌లైన్ UPI ఎలా పనిచేస్తుంది?
ఆఫ్‌లైన్ UPIను(Offline UPI) యాక్టివేట్ చేయడం కూడా చాలా సులభం:

  • ముందుగా మొబైల్‌లోని *డయలర్ ద్వారా 99# నంబర్‌ను డయల్ చేయాలి.
  • తర్వాత కనిపించే UPI మెనూ నుంచి చెల్లింపుల ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • పంపాల్సిన మొత్తం, రిసీవర్ UPI ID లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

ఈ సర్వీస్ దేశంలో 83 బ్యాంకులు మరియు 4 ప్రధాన టెలికాం ఆపరేటర్ల ద్వారా అందుబాటులో ఉంది. ఫీచర్ సెక్యూర్‌గా ఉండటంతోపాటు, చిన్న మొత్త చెల్లింపుల కోసం ఇది చాలా ఉపయోగకరం. ఇంటర్నెట్ ఇబ్బందులుండే ప్రదేశాల్లో కూడా వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఈ ఫీచర్‌తో చెల్లింపులు చేయగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com