ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- December 08, 2025
దోహా: ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హమద్ అలీ అల్-ఖాటర్ను నియమించారు.ఆయన నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ ప్రకటించింది. అల్-ఖాటర్ ఇంజనీర్ బదర్ మొహమ్మద్ అల్-మీర్ స్థానంలో నియమితులయ్యారు. అల్-ఖాటర్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్‌లో చేరారు. అక్కడ ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఇంజనీర్ బదర్ మొహమ్మద్ అల్-మీర్ చేసిన సేవలకు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్, హెచ్ ఇ సాద్ షెరిదా అల్-కాబి కృతజ్ఞతను తెలియజేశారు. హమద్ అలీ అల్-ఖాటర్ నియామకాన్ని స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఖతార్ ఎయిర్వేస్ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







