మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- December 08, 2025
న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. సత్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత 11 ఏళ్ల నుంచి న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు.అతడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే 2023లో ఓ మైనర్ ప్రయాణికురాలు రాత్రిపూట అతడి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.
సత్వీందర్ సింగ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు.దారిలో వెళ్తుండగా జీపీఎస్‌ను ఆఫ్ చేశాడు. కారు రూట్ మార్చి వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలతో పరిశీలించారు. అనంతరం సత్వీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ కేసుపై అక్కడి కోర్టు విచారణ జరిపింది.సత్వీందర్ సింగ్‌ను దోషిగా తేల్చి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







