'ఛాంపియన్' నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్
- December 10, 2025
ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం - మొత్తం గ్రామం - వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
ప్రతి కుటుంబ సభ్యుడు వివాహానికి వారు అందిస్తున్న బహుమతుల గురించి మాట్లాడే విధానం సాంప్రదాయ వేడుక సారాంశాన్ని అందంగా చూపించింది. అప్పగింతలు సమయంలో భావోద్వేగాలు అందరికి కనెక్ట్ అయ్యాయి.
మిక్కీ జె మేయర్ మ్యాజిక్ క్రియేట్ చేశారు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా ప్రజెంట్ చేసింది గాయకులు రితేష్ జి రావు, మనీషా ఈరబత్తిని తమ వోకల్స్ మరో మరింత అందాన్ని తీసుకొచ్చారు. బృందా గోపాల్ మాస్టర్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్ గా వుంది.
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనశ్వర రాజన్ జోడి డ్యాన్స్ తో పాటకు ఉత్సాహాన్ని తెస్తారు. సల్లంగుండాలే సాంగ్ ప్రతి వివాహ వేడుకలో మ్రోగబోతుంది.
తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: రోషన్, అనస్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
సాంకేతిక బృందం:
బ్యానర్లు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
సమర్పణ: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డిఓపి: ఆర్ మధీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







