మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

- December 13, 2025 , by Maagulf
మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం: ఉర్సు పండుగకు అజ్మీర్ వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మచిలీపట్నం నుంచి అజ్మీర్ వరకు ప్రత్యేక రైలును నడపనున్నట్టు మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు.

మైనారిటీల తీర్థయాత్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును నడపడం ద్వారా భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ నిర్ణయ లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.

రైలు వివరాలు:

రైలు నం. 07274 మచిలీపట్నం నుండి డిసెంబర్ 21 ఉదయం 10 గంటలకు బయలుదేరి, డిసెంబర్ 23 సాయంత్రం 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది.

అజ్మీర్ ఉర్సు ఉత్సవాలు డిసెంబర్ 24, 25, 26, 27 తేదీల్లో జరుగుతాయి.

తిరుగు ప్రయాణానికి రైలు నం. 07275 అజ్మీర్ నుంచి డిసెంబర్ 28 ఉదయం 8:25 గంటలకు బయలుదేరి, డిసెంబర్ 30 ఉదయం 9:30 గంటలకు మచిలీపట్నం చేరుతుంది.

అజ్మీర్ ఉర్సు మహోత్సవానికి వెళ్లే ముస్లిం సోదరులు ఈ ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని బాలశౌరి అన్నారు.

ఈ ప్రత్యేక రైలుకు అనుమతి మంజూరు చేసిన సికింద్రాబాద్ సదరన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com