గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- December 13, 2025
మనామా: బహ్రెయిన్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న ఒక రెస్టారెంట్ యజమానికి క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించారు. అలాగే, ఇంటి నుండి లైసెన్స్ లేకుండా కిచెన్ నడుపుతున్నందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD7,200 జరిమానా విధించారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేని వస్తువులను ఉపయోగించినందుకు రెస్టారెంట్ యజమానిని దోషిగా నిర్ధారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. రెస్టారెంట్‌లోని ఒక ఉద్యోగి నుండి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపినట్టు వెల్లడించింది.
అధికారులు రెస్టారెంట్ ను తనిఖీ చేయగా, గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, బూజు పట్టిన ఆహారం, తెలియని కంపెనీలకు చెందిన వస్తువులు మరియు లైసెన్స్ లేకుండా ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..







