దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్‌ల క్లీనింగ్ కు డ్రోన్‌లు..!!

- December 17, 2025 , by Maagulf
దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్‌ల క్లీనింగ్ కు డ్రోన్‌లు..!!

దుబాయ్: దుబాయ్ లో కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ ను రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్‌లను డ్రోన్‌ల ద్వారా క్లీన్ చేయడాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మ్యాన్‌లిఫ్ట్‌ల అవసరాన్ని తొలగిస్తుందని, దాంతో సమయం, ఖర్చులు కలిసివస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఇంధనం మరియు నీటి వినియోగాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది.     

ఈ ఏడాది ప్రారంభంలో RTA దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ స్టేషన్లలో బోర్డులను  క్లీన్ చేసేందుకు డ్రోన్‌ల పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది.  అది విజయవంతం కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్లీన్ చేసేందుకు ఉపయోగించనున్నట్లు RTAలోని రోడ్లు మరియు సౌకర్యాల నిర్వహణ డైరెక్టర్ అబ్దుల్లా అలీ లూతా తెలిపారు.

మొదటి దశలో మర్రాకేష్ స్ట్రీట్-రెబాట్ స్ట్రీట్ జంక్షన్‌లో ట్రయల్ రన్‌లు ఉన్నాయని, ఇక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేసి పనులను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.  డ్రోన్‌లు సిగ్నల్ ఒక వైపును కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల్లో క్లీన్ చేయగలవని, సమయాన్ని 25 నుండి 50 శాతం, ఖర్చులను 15 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో 25 శాతానికిపైగా ఖర్చులను ఆదా చేస్తాయని అన్నారు. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com