విక్టరీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి

- December 13, 2025 , by Maagulf
విక్టరీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ లో నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రమోషన్స్ ఇప్పటికే హై గేర్‌లో వున్నాయి. రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ద్వారా ఈ అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఆ వీడియోలో సినిమా మొత్తం టీమ్‌ వెంకటేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. చివర్లో ఆయన ఫస్ట్ లుక్‌ రివిల్ కావడం హైలైట్‌గా నిలుస్తుంది. ఫస్ట్  లుక్‌లో వెంకటేష్‌  తనదైన చరిస్మాతో ముందుకు నడుస్తూ కనిపించారు. మోడరన్ దుస్తుల్లో ఆయన స్టైల్‌ ఆకట్టుకుంటుంది. డార్క్ షర్ట్‌పై ప్యాటర్న్ ఉన్న బ్లూ జాకెట్‌, వైట్ ట్రౌజర్స్‌తో ఆయన లుక్‌ అదిరిపోయింది. సన్‌గ్లాసెస్‌, క్లియర్‌గా డిఫైన్ అయిన లుక్‌ ఆయన పాత్రలోని కూల్‌నెస్‌, కాన్ఫిడెన్స్‌ను ప్రజెంట్ చేస్తోంది.

ఈ ఫ్రేమ్‌ను మరింత ఎలివేట్ చేసేది బ్యాక్‌డ్రాప్‌. వెనక భాగంలో నిలిచిన హెలికాప్టర్‌, ఆయన వెంట కదులుతున్న సెక్యూరిటీ సిబ్బంది..ఇవన్నీ కలిసి వెంకటేష్‌ పాత్ర ఎంతటి ప్రభావవంతమైన స్థాయిలో ఉంటుందో తెలియజేస్తున్నాయి.

వెంకటేష్‌తో విజయవంతమైన చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈసారి కూడా వెంకీ మార్క్ ని హైలైట్ చేసేలా, కొత్తదనం ఉన్న పాత్రను డిజైన్ చేశారు.

ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు, సహనటుడు వెంకటేష్‌కు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
“ మై డియర్ @VenkyMama కి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీ పంచుతూనే ఉంటావు. #ManaShankaraVaraPrasadGaru షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎంతో మధురంగా గుర్తు చేసుకుంటాను 🤗. నీకు ఆనందంతో, ఆశీర్వాదాలతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను.

ఈ సందేశంతో పాటు చిరంజీవి, వెంకటేష్‌తో కలిసి ఉన్న సినిమా వర్కింగ్ స్టిల్‌ను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలో ఇద్దరూ స్టైలిష్‌గా, ఉత్సాహంగా, చిరునవ్వులు చిందిస్తూ కనిపించటం, వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలిజేస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు.   ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు.

ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఉత్సాహం పెరుగుతుండగా, మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com