లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల వాయిదా
- December 15, 2025
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో యూత్ ఆడియెన్స్‌లో, ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్,నటిస్తున్న చిత్రం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ. ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది.. మూవీ త్వరలోనే విడుదల కానుందని యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
అయితే కొత్త తేదీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. తాజా టాక్ ప్రకారం ఈ మూవీని వాలెంటైన్ వీక్‌లో (ఫిబ్రవరి, 2026) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై ఎస్ ఎస్ లలిత్ కుమార్‌తో కలిసి నయనతార నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







