NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు

- December 16, 2025 , by Maagulf
NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు

విశాఖపట్నం: జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. నాట్స్, రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్, గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థల సహకారంతో.. గాజువాకలో ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలలకు చేయూతనిచ్చింది. చట్టనువాలి పాలం, పాత గాజువాక, డ్రైవర్స్ కాలనీ పాఠశాలల్లోని చిన్నారుల భవిష్యత్తు కోసం లక్ష రూపాయల విలువైన టీచింగ్ మెటీరియల్‌ను నాట్స్ అందించింది.  చిన్నారులు ఆటపాటలతో నేర్చుకునేందుకు వీలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చార్ట్‌లు, ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు గ్లోబ్‌లు, ఆట వస్తువులను పంపిణీ చేసి... కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, సృజనాత్మకతను పిల్లల్లో పెంచేందుకు నాట్స్ తోడ్పడింది.

గ్రీన్ స్టూడియో కాన్సెప్ట్‌ కు నాట్స్ ఆర్ధిక మద్దతు అందించింది. డ్రైవర్స్ కాలనీ చుట్టుపక్కల ఉన్న ఏకంగా తొమ్మిది పాఠశాలలను దత్తత తీసుకున్న నాట్స్, చిన్నారుల్లోని అపారమైన నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ గ్రీన్ స్టూడియో పనిచేయనుంది.. నడుపూరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో... విద్యార్థులు తమ భావాలను, ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఒక వేదిక కానుంది. గాజువాకలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి  నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ కార్య నిర్వాహక సభ్యులు కిరణ్ మందాడి వివరించారు. ఈ గ్రీన్ స్టూడియో భవిష్యత్తులో అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేయడానికి  కృషి చేస్తామని  గ్లో సెక్రెటరీ యార్లగడ్డ వెంకన్న చౌదరి అన్నారు. గ్రీన్ స్టూడియో కాన్సెప్ట్ వినూత్నంగా ఉందని కొనియాడుతూ, దీనిని నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని ఎంఈఓకి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, రోటరీ క్లబ్ మెంబర్స్, స్కూల్ టీచర్స్, ఎంఈఓ, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com