లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

- December 17, 2025 , by Maagulf
లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవిధానాల పై పలు కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నారు. వీసాలపై రోజుకో కొత్త రూల్స్ ను ప్రకటిస్తూ, భారతీయుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తున్నారు. ఈ తరుణంలో భారతీయులకు ఓ గుడ్ న్యూస్.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ను ప్రారంభించింది. ఈ కాన్సులర్ సెంటర్ డిసెంబర్ 15, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా పాస్ పోర్ట్ సేవలు, వీసా సంబంధిత ప్రక్రియలు, ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దరఖాస్తులు, జనన-మరణ ధృవీకరణ పత్రాలు, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందే అవకాశం కలుగుతుంది.

సోమవారం నుంచి శుక్రవారం వరకు సేవలు
ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ను డౌన్ టౌన్ లాస్ ఏంజిల్స్ లోని 800 ఎస్ ఫిగ్యురోవా స్ట్రీట్, సూట్ 1210, లాస్ ఏంజిల్స్, సిఎ 90017 చిరునామాలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు పనిచేస్తుంది. దరఖాస్తుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శనివారాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ సేవలు అందించబడతాయి
ఈ కేంద్రం ద్వారా పాస్ పోర్ట్ దరఖాస్తులు, రెన్యూవల్, వీసా సేవలు, ఒసిఐ కార్డు కొత్త దరఖాస్తులు, రీ-ఇష్యూ, ఇతర మిస్సె లేనియస్ సేవలు, భారత పౌరసత్వం త్యజింపు (సరెండర్ సర్టిఫికేట్), గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (GEP), అటెస్టేషన్ తోపాటు ఇతర కాన్సులర్ సేవలు అందించబడతాయి. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఇకపై దూర ప్రయాణాలు చేయాలల్సిన అవసరం లేకుండా, సమయం, ఖర్చును ఆదా చేసుకుంటూ సౌకర్యవంతంగా సేవలు పొందగలుగుతారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఇది ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com