WPL 2026 షెడ్యూల్ విడుదల..
- December 17, 2025
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 పూర్తి షెడ్యూల్ విడుదలైంది.నాలుగో సీజన్లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, 2024 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 9న నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది.
ఈ సీజన్లో ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా ఫైనల్ వీకెండ్‌కు కాకుండా గురువారం రోజున జరగనుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. పురుషుల టీ20 వరల్డ్‌కప్‌తో సమయం తగలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొత్తం 28 రోజుల్లో 22 మ్యాచ్‌లతో డబ్ల్యూపీఎల్ 2026 నిర్వహించనున్నారు. ఈ టోర్నీ రెండు వేదికల్లో జరగనుంది. తొలి 11 మ్యాచ్‌లు నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. జనవరి 10, 17 తేదీల్లో డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు మధ్యాహ్నం జరుగుతాయి. మిగతా మ్యాచ్‌లు అన్నీ రాత్రి వేళల్లో నిర్వహిస్తారు.
ఆ తర్వాత టోర్నీ వడోదరలోని కోటంబి స్టేడియానికి మారుతుంది. అక్కడ మిగిలిన 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 2న ఎలిమినేటర్, ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ అక్కడే జరుగుతుంది.
ఈ సీజన్లో కూడా ఫార్మాట్లో ఎలాంటి మార్పులు లేవు.ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు డబుల్ రౌండ్ రాబిన్ విధానంలో తలపడతాయి. టాప్ టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరగా, రెండో మరియు మూడో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో పోటీ పడతాయి.
డబ్ల్యూపీఎల్ ముగిసిన 10 రోజుల తర్వాత భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







