ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- February 07, 2026
మస్కట్: ఒమన్ లో జువైనల్ నేరాలు పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 కు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదికలో నేరాల స్వభావాన్ని వివరిస్తూ.. జువైనల్ నేరాల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో దొంగతనం, బెదిరింపులు, దుర్భాషలాడడం, సైబర్ నేరాలు,హ్యాకింగ్, ఆన్‌లైన్ బెదిరింపులు మరియు అనుచిత కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ వంటి కేసుల నమోదుపై ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఒమన్‌లో పిల్లలపై జరుగుతున్న నేరాలు మరియు వేధింపుల కేసులు పెరగడం గురించి వివరించారు.
పిల్లలను తీవ్రమైన నేరాల నుండి రక్షించడమే ప్రధాన లక్ష్యంగా చట్టాలను కఠినంగా అమలు చేయాలని సమైల్ హాస్పిటల్ అధిపతి డాక్టర్ మహమూద్ అల్ రహ్బీ తెలిపారు. పిల్లలలో విపరీత ధోరణులను త్వరగా గుర్తించడం, వారికి అవసరమైన నిరంతరం మద్దతు ఇవ్వడం ద్వారా సమస్యలను దూరం చేయవచ్చని పేర్కొన్నారు
ఒమన్‌లో పెరుగుతున్న పిల్లల నేరాలను పరిష్కరించడానికి, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని బదర్ అల్ సమా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బెన్నీ పనక్కన్ సూచించారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. కాగా, పిల్లలు మారడానికి అవసరమైన చొరవ ఇంట్లో నుంచే ప్రారంభం కావాలని
NMC స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సైకియాట్రిస్టు డాక్టర్ విజయ్ నరేష్ సూచించారు. పిల్లల ప్రవర్తనపై స్కూల్, ఫ్రెండ్స్ , బయటి పరిసరాలు, కమ్యూనిటీ ముఖ్యమైన ప్రభావం చూపుతాయని తెలిపారు.
ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించడం, అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా నేరాలను నిరోధించడంలో సహాయపడుతుందని బుర్జీల్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, న్యాయవాదులు డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్వి అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







