యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- December 18, 2025
ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడుక ‘ఆస్కార్’ (Oscars). ఆస్కార్ (Oscars) పురస్కార వేడుక కోసం ప్రపంచ సినీ జనం ఎంతో ఆతృతగా, ఎదురు చూస్తుంటారు. సినిమా రంగానికి ఇదొక ప్రతిష్టాత్మక వేడుక. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది (Oscars 2026). ఆస్కార్ కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. ప్రస్తుతం 98వ ఆస్కార్ వేడుకలు 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి.
ఇప్పటివరకు టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈ వేడుకలు 2029 నుంచి నేరుగా యూట్యూబ్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. దీనికి సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్‌తో మల్టీ-ఇయర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2029 నుంచి 2033 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండబోతుంది.
1976 నుంచి దాదాపు 50 ఏళ్లుగా ఆస్కార్ వేడుకల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC (Disney) నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకతో ఈ టీవీ ఒప్పందం ముగియనుంది. దీంతో ఆస్కార్ వేడుకల స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్ దక్కించుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆస్కార్ వేడుకలు యూట్యూబ్‌లోకి రావడం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







