40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్

- December 18, 2025 , by Maagulf
40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్

అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు ఆయన లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్‌తో పాటు కేవలం 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

తాడేపల్లి నివాసం నుంచి విజయవాడకు బయల్దేరిన జగన్, ముందుగా బందర్ రోడ్డులోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన లోక్ భవన్‌కు చేరుకుంటారు. పోలీసు నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో నేతలే ఆయన వెంట వెళ్లనుండగా, గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే కోటి సంతకాల ఉద్యమం ప్రధాన లక్ష్యమని వైసీపీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com