కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!
- December 19, 2025
దోహా: కువైట్‌లో ఖతార్ జాతీయ పేమెంట్ కార్డు 'హిమ్యాన్' కు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఖతార్ మూడవ ఆర్థిక రంగ వ్యూహానికి అనుగుణంగా చేపట్టిన ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైందని వెల్లడించింది. అదే సమయంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, సేవలను మెరుగుపరచడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.
అలాగే GCC దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఖతార్ సెంట్రల్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా "హిమ్యాన్"ను కువైట్ లో అంగీకరిస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ స్వాగతించింది. హిమ్యాన్ కార్డుదారులు ఇప్పుడు అత్యున్నత భద్రత ప్రమాణాలకు అనుగుణంగా, కువైట్ వ్యాప్తంగా ఉన్న వివిధ పాయింట్ ఆఫ్ సేల్స్ మరియు ఏటీఎంలలో కొనుగోలు లావాదేవీలు మరియు నగదు ఉపసంహరణలు చేయవచ్చని తెలిపింది.
"హిమ్యాన్" కార్డును ఖతార్ సెంట్రల్ బ్యాంక్ యాజమాన్యంలోని, ఖతారీ వాణిజ్య బ్రాండ్‌తో కూడిన మొదటి జాతీయ చెల్లింపు కార్డుగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







